సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) దర్శక ధీరుడు, రాజమౌళి కాంబోలో వస్తున్న చిత్రం SSMB29. రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా టైటిల్ ను గత రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో, వేలాది కృష్ణ మహేష్ అభిమానుల మధ్యన ‘ గ్లోబ్ ట్రాటర్‘ అనే ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేశారు. మొదటి నుంచి అనుకుంటున్నట్లే సినిమాకు పవిత్ర కాశీ కి మరో పేరు ‘వారణాసి’(Vaaranaasi) అనే టైటిల్ నే జక్కన్న ఫిక్స్ చేశాడు. దీంతో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశాడు. అయితే ఐమాక్స్ తరహాలో 100 అడుగులు ఎత్తుతో ఏర్పాటు చేసిన భారీ ఎల్ ఈడీ స్క్రీన్ 45 జనరేటర్లు విద్యుతు సరఫరా కూడా సరిపోక మొదట్లో మొరాయించడంతో రాజమౌళి హైరానా పడ్డారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ హనుమాన్ చాలీసా చదవటం మొదలు పెట్టారు. దేవుడు కరుణించాడు. మొత్తానికి గ్లింప్స్ ప్రదర్సన పూర్తీ అయ్యింది. అభిమానులను అలరించించింది. రాజమౌళి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ వల్లే మన తెలుగు సినీపరిశ్రమలో సాంకేతికత పెరిగిందని, ఈస్టమన్ కలర్, సినిమా స్కోప్, 70 ఎం ఎం సినిమాలు వచ్చాయని అటువంటి సాహసి పుత్రుడు మహేష్ బాబు తో సినిమా అంటే తొలిసారి రియల్ ఐమాక్స్ పార్మట్ తీశామని అన్నారు. మహేష్ బాబు ను తొలిసారి శ్రీరామ చంద్రునిగా చుపిస్తున్నానని ఆ గెటప్ ఆయనను చుస్తే నాకే రోమాలు నిక్కబొడుచు కున్నాయని అంత అందంగా ఉన్నారన్నారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. ముందుగా కృష్ణ గారికి ఘన నివాళ్లు అర్పించారు. ‘ మిమ్మల్ని కలిసి చాలా రోజులవుతుంది. నార్మల్ ఎంట్రీ ఇస్తాను అంటే.. రాజమౌళి వద్దు అన్నాడు. ఎద్దుపై త్రిసూలం పట్టుకొని రావాల్సిందే అన్నారు. అందుకే ఆలా వచ్చాను. పౌరాణికం చేయమని నాన్నగారు ఎప్పుడూ అడుగుతుండేవారు. ఆయన మాటలు నేను ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఆయన నా మాటలు ఆయన వింటుంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మనతోనే ఉంటాయి.అన్నారు. వారణాసి ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందర్నీ గర్వ పడేలా చేస్తాను. నా అభిమానులకు నాన్న గారి అభిమానులకు చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేమి తెలియదు.అంటూ దండం పెట్టారు.
