సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగులో అగ్ర నిర్మాత దిల్ రాజు తమిళ అగ్ర హీరో విజయ్ హీరోగా తెలుగు, తమిళ్ లో ద్విభాషా సినిమాగా నిర్మించిన ‘వారసుడు’ విడుదలను వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్ లో నేడు, సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటిం చారు. ‘వాల్తేరు వీరయ్య ’ ‘వీర సింహారెడ్డి’ చిత్రాలను దృ ష్టిలో పెట్టుకుని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు, అయితే 3 రోజులు ఆలస్యంగా జనవరి 14న ఈచిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అయితే ‘‘వారసుడు’ సినిమా తమిళ వెర్షన్ జనవరి 11న విడుదల చేస్తున్నాం. తెలుగులో మాత్రమే 14న విడుదల చేయనున్నాం . పరిశ్రమలో ఉన్న పెద్దలందరితో చర్చలు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నా ను. వారసుడు సినిమాపైన నాకు ఉన్న నమ్మకం ఉంది. నిజానికి ‘వాల్తేరు వీరయ్య ’, ‘వీర సింహారెడ్డి’ నా సినిమా పోటీ కాదు, ఈ సినిమాపూర్తి స్థాయి కుటుంబకథా చిత్రం. గతంలో మా బ్యానర్ నుంచి వచ్చి న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’,‘శతమానం భవతి’ వంటి కుటుంబకథా చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి. ఇప్పు డు ఈసినిమా కూడా అదే విధంగా ప్రేక్షకుల్ని అలరించనుంది. నేనొక అడుగు వెనక్కి వేశాననే బాధ లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *