సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే , రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పెంటపాడు మండలం ముదునూరు లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోజనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టనున్న ‘అన్నవరం టూ భీమవరం’యాత్ర జరుగుతుందని గ్యారంటీరీ లేదని .. ఇప్పటికే రెండుసార్లు వారాహి వాహనం పై పవన్ కళ్యాణ్ యాత్ర వాయిదా పడిం దని ఆయన గుర్తుచేశారు. నిజానికి జనసేన ప్రచార రథం వారాహి స్టీరింగ్ చంద్రబాబు చేతిలో ఉందని.. ఆయన అనుమతి లేకుండా పవన్ ఒక్క అడుగుకూడా ముందుకు వెయ్యలేదని మంత్రి కొట్టు విమర్శించారు.గతంలో కొండగట్టు ఆం జనేయస్వామి గుడి నుంచి వారాహి రథం పై పవన్ కళ్యా ణ్ ప్రచార యాత్ర ప్రారంభిస్తానని చెప్పి ఎందుకు ఆగిపోయారని ప్రశ్నిం చారు. కేవలం ఆ సమయం లో చంద్రబాబు ప్రేరణతో రాజధాని రైతుల పాదయాత్ర జరుగుతుంది కాబట్టి యాత్ర ఆపేయాలని చంద్రబాబు ఆదేశించడం తో పవన్ కల్యాణ్ కేవలం పూజలతోనే సరిపెట్టారన్నారు. ఆ తర్వాత రెండోసారి కూడా వారాహి వాహనం పై జనసేన ప్రచార యాత్ర ప్రారంభించాలని పవన్ కల్యాణ్ తలపెడితే ఆసమయంలో లోకేష్ యువ గళం పాదయాత్ర కోసం ప్రచార యాత్ర ఆగిపోయిందన్నారు. ఈ విధంగా రెండు సార్లు చంద్రబాబు చెప్పగానే పవన్ కల్యాణ వారాహి వాహనాన్ని షెడ్లో పెట్టేశారన్నారు. ఇప్పు డు మూడోసారి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలలో వారాహి వాహనం పై పవన్ ప్రచార యాత్ర ప్రారంభిస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *