సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం విజయనగరం జిల్లా గుర్లలో ఇటీవల డయేరియా తో చనిపోయిన పలువురు మృతుల కుటుంబాలను మాజీ సీఎం వై.ఎస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్యం వైద్య సహకారం లేకపోవడం వల్లే డమేరియా తో ప్రజలు చనిపోతున్నారని అన్నారు. అయితే చంద్రబాబు సర్కార్ రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగితే వెంటనే దాన్ని ఎలా డైవర్షన్ చేయాలో చూస్తున్నారు తప్పా.. పని చేయడం లేదు అని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మొన్నటి వరకు విజయవాడ వరదబాధితుల కష్టాలను డైవర్ట్ చెయ్యడానికి తిరుమల లడ్డు టాఫిక్ తెచ్చారని ప్రజలకు అర్ధం అయిపోయిందని. ఇప్పడు రాష్ట్రంలో అరాచక పాలనా ఫై ప్రజలు ద్రుష్టి పెట్టకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి.. నా ఫొటో.. నా చెల్లి ఫొటో.. మా అమ్మ ఫొటో వాళ్ళ మీడియాలలో పెట్టి ఆస్తుల వివాదాలపై ప్రచారం చేస్తున్నారు. మీ ఇళ్లలో ఇలాంటి సమస్యలు లేవా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో ఉన్న గొడవలే.. మా ఇంట్లోనూ ఉన్నాయి. మీ స్వార్థం కోసం ఇలాంటివి పెద్దవిగా చేసి చూపించొద్దు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి అని ఆయన అన్నారు.
