సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీల మధ్య ఇప్పటికే అనధికార పొత్తు కుదిరిందని ఆ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం , నర్సాపురం, తాడేపల్లి గూడెం సీట్లు జనసేన కు కేటాయిస్తారని ఒక ప్రక్క ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో మరో ప్రక్క టీడీపీ అధినేత చంద్రబాబు తో ఉండవల్లి లోని ఆయన నివాసంలో , భీమవరం కు చెందిన మాజీ రాజ్యసభ సభ్యురాలు, టీడీపీ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి గత మంగళవారం ముఖాముఖీ సమావేశం కావడం ఆసక్తికర పరిణామం. దీనిపై తోట సీతారామ లక్ష్మి మాట్లాడుతూ.. చంద్రబాబు తో జరిగిన సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలో రానున్న ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కృ షి చేస్తున్నట్లు, పార్టీ తరపున ఇటీవల చేప్పట్టిన కార్యక్రమాల గురించి, వాటికీ జనం నుండి వచ్చిన స్వాందన గురించి వివరించినట్లు తెలిపారు. చంద్రబాబు తనతో జిల్లాలో పార్టీలో. . వర్గపోరును ఉపేక్షించవద్దని.. ఈ తరహా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారి జాబితా ఇవ్వాలని అడిగినట్లు సీతారామలక్ష్మి తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న నారా లోకేశ్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాం క్షిస్తూ పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపినట్లు ప్రకటించారు. ఎక్కడ ఆమె జనసేన పొత్తుపై మాత్రం కామెంట్ చెయ్యకపోవడం గమనార్హం. ( చర్చించకుండా ఉంటారా?)
