సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో రాష్ట్రంలో వాలంటీర్ల విషయంలో ఇంట్లో మగాళ్లు లేనప్పుడు తలుపులు కొడతారు అంటూ.. తీవ్రంగా మండిపడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ముగింట మాత్రం వారిపై సీఎం జగన్ కు మించి వరాల జల్లు కురిపిస్తున్నారు. ఉగాది పండగ వేళ.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి శ్రీ క్రోధ నామ సంవత్సర శుభాకంక్షాలు తెలిపిన చంద్రబాబు పనిలో పనిగా రాష్ట్రంలోని వలంటీర్లకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్లను తొలగిస్తామంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని, పాత వారినే కొనసాగిస్తామని ఎవరు రాజీనామాలు చెయ్యవద్దని ప్రకటించారు.
