సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఇటీవల వాలంటీర్లపై పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేసారని భావిస్తూ ఆ కామెంట్లను ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీవ్రంగా పరిగణించింది. పవన్ కల్యాణ్‌పై గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మార్చి 25వ తేదీన విచారణకు హాజరు రావాలని గుంటూరు కోర్టు పవన్ కల్యాణ్‌కు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు వాలంటీర్ కుమార్ అనే వ్యక్తి కూడా పోలీసులకు.. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న తమ వాలంటీర్ లను పవన్ దారుణంగా కించపరుస్తున్నారని ఇటీవల ఫిర్యాదు చేశారు. దాంతో పవన్ కల్యాణ్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు
