సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుమారు 20 ఏళ్ళ క్రితం ‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ మెగాస్టార్ చిరు ఫుల్ మాస్ తో మెయిన్‌ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు.విక్టరీ వెంకటేష్ కూడాచిరంజీవితో కలసి ఒక మెరుపు పాత్రలో గెస్ట్ అఫిరెన్సు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించి పోస్టర్స్, టీజర్స్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్‌ని అందుకున్నాయి. తాజాగా నేడు, సోమవారం రవితేజ ఫస్ట్ లుక్‌ని చిరంజీవి విడుదల చేసారు. ఓ చేతిలో గొడ్డలితో సిలిండర్‌ని పట్టుకుని.. మరో చేతిలో చాలా జాగ్రత్తగా మేకపిల్లని పట్టుకున్న ఈ పోస్టర్ ఊర మాస్‌గా ఉంది. ఆ పోస్టర్ మీద.. ‘పవర్‌కి కొత్త పేరు విక్రమ్ సాగర్ ఏసీపీ’ అని రాసి ఉంది. ఈ చిత్రంలో రవితేజ్ క్యారెక్టర్ పేరు విక్రమ్ సాగర్. అంతేకాకుండా, ఈ పోస్ట్‌కి.. ‘అతని బ్యాగ్రౌండ్ – కేవలం హార్డ్ వర్క్.. అతని సపోర్ట్ – ప్రేమించే మాస్.. రవితేజని విక్రమ్ సాగర్ ఏసీపీగా పరిచయం చేస్తున్నాం’ అని రాసుకొచ్చాడు. అలాగే రవితేజ సైతం ఈ పోస్టర్‌ని పోస్ట్ చేసి తన హర్షాన్ని వెలిబుచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *