సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్‌ఫాదర్’ వచ్చే నెల 5న దసరా కానుకగా విడుదలవడానికి సిద్ధంగా ఉంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార కీలక పాత్ర చేస్తున్నారు. ఇంకా చిరు.. నటిస్తున్న ‘భోళాశంకర్’ చిత్రం కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. అలాగే వీటితో పాటు చిరంజీవి 154 చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ బాబీ దర్శకత్వంలో వాల్తేరు బ్యాక్ డ్రాప్ లో ఇప్పటికే షూటింగ్ జరుగుతుంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. ఇద్దరిపైనా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మరో షాకింగ్ న్యూస్ఏమిటంటే.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన గెస్ట్ గా నటిస్తున్నారని వినికిడి. సినిమా క్లైమాక్స్ లో హీరో వెంకీ కీలకమైన అతిథి పాత్రలో కొద్దీ సేపు సందడి చేస్తారని టాక్.. ( కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో సూర్య కనిపించిన తరహాలో..)ఇక గతంలో 25 ఏళ్ళ క్రితం వెంకటేశ్ నటించిన ‘త్రిమూర్తులు’ చిత్రంలో ఓ పాటలో అతిథిపాత్రలో చిరంజీవి తళుక్కుమన్నారు.చిరంజీవిపై ప్రత్యేక మైన అభిమానంతో పాటు గతంలో తనతో వెంకిమామ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ కోరిక మేరకు ఈ రోల్ వెంకీ ఒప్పుకొన్నారని తెలుస్తుంది.
