సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’.లో శ్రుతిహాసన్ కథానాయిక. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా నుంచి తాజాగా నేటి శనివారం, ఉదయం చిరంజీవి, రవితేజలపై చిత్రీకరించిన ‘పూనకాల్ లోడింగ్’ సాంగ్ వీడియో క్లిప్స్ విడుదలైంది. మంచి మాస్ ఊపుతో ఉన్న ఈ పాటలో ఒరిజినల్ వాయిస్ లో కూడా చిరంజీవి , రవితేజ స్వయంగా గొంతుకలపడం , తెరమీద మాత్రమే కాదు రికార్డింగ్ స్టూడియోలో కూడా కలసి పాడుతూ చిందులు వెయ్యడం గమ్మత్తుగా ఉంది. వారి అభిమానులకు మంచి జోష్ నింపుతుంది మరి..
