సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ,భీమవరం వారి మహిళల ఆధ్వర్యంలో జబర్దస్త్ టీమ్ ఆహుతులుగా జరిగిన ప్రూవ్ టాలెంట్ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గత ఆదివారం స్థానిక త్యాగరాజ భవనంలో నిన్న మధ్యాహ్నం నుండి రాత్రి 9 గంటల వరకు జరిగిన కార్యక్రమాలలో లోకల్ బాల బాలికలలో , మరియు యువత లో ఉన్న ప్రజ్ఞ పాటవాలు , దానికి తోడు జబర్దస్త్ టీమ్ చేసే వినోదాలు అందరిని ఆహ్లద పరిచాయి. ఈ కార్యక్రమాన్ని వనితా కే సి జి ఎఫ్ జ్యువలరి కి చెందిన పులపర్తి మణి ,జి రమ్య, పి లక్ష్మి పర్యవేక్షించారు.
