సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ లోని శ్రీకాకుళంలోని మత్యకారులు 2017చివరలో పాకిస్తాన్ సైనికులకు చిక్కి అక్కడ జైలుకు వెళ్లి 13 నెలలు పడిన కష్టాలు తదుపరి 2019 లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రోద్భలంతో కేంద్రంలో బీజేపీ మంత్రి సుష్మ స్వరాజ్ నేతృత్వంలో పాకిస్తాన్ తో చర్చలు జరిపి మత్యకారులను విడిపించిన వాస్తవ కధకు కొంత సినీ కల్పనలు కలిపి గీతా ఆర్ట్స్‌ బ్యానర్ ఫై అల్లు అరవింద్‌, బన్నీ వాసు నిర్మాణంలో చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా నాగచైతన్య, సాయిపల్లవి , పృథ్వీరాజ్‌, దివ్యాపిళ్లై, ప్రకాశ్‌ తదితరుల నటులతో రూపొంది నేడు శుక్రవారం ప్రేక్షకుల తీర్పు కోసం వచ్చింది. నాగచైతన్య, సాయిపల్లవిలు ఇప్పటికే లవ్‌స్టోరీ సినిమా తో పెద్ద హిట్ కొట్టారు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్స్లో ‘తండేల్‌’ సినిమా కథ విషయానికి వస్తే.. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) మత్య్సకారులు కుటుంబానికి చెందిన వారు. రాజు సముద్రంలో చేపల వేటకు వెళ్ళినప్పుడల్లారోజులు తరబడి ఆ ప్రేమికులు ఫోన్‌లో మాట్లాడే ఒక్క రోజు కోసం నెలంతా ఎదురు చూస్తుంటారు.మధ్యలో రాజుపై అలకతో అతనికి సత్య దూరమవుతుంది. ఇద్దరి మధ్య మాటలు ఉండవు. సముద్రంలో వేటకు వెళ్లిన రాజు.. అతని బృందం22 మంది ప్రయాణించే బోటు తుఫాను తాకిడికి పొరపాటున పాకిస్థాన్‌ బోర్డర్‌లోకి ప్రవేశిస్తుంది. దాంతో అనుకోని పరిణామాలులో పాకిస్థానీ జైలుకి వెళ్లాల్సి వస్తుంది. దాంతో సత్య, రాజులు మళ్లీ ఎలా కలిశారు? పాకిస్థాన్‌ చెర నుంచి ఎలా భయపడ్డారు అనేది కథ. సినిమా ఎలా ఉందంటే.. దర్శకుడు చందూ సరికొత్త తరహాలో సన్నివేశాలు కన్నా పాత తరహాలోనే ఎక్కువగా భావోద్వేగాన్ని ఎలివేట్‌ చేయడం మీదే దృష్టి పెట్టారు. దాంతో ఫస్టాఫ్‌ అంతా సాగతీత గా నడుస్తుంది. ఇంట్రవెల్‌ కి ముందు సముద్రంలో తుఫాను, అక్కడ చిక్కుకున్న బోటు విజువల్స్‌ అద్భుతంగా తీశారు. అయితే పాకిస్తాన్ జైలు లో కష్టాలు పడే సన్నివేశాలలో వాస్తవికత కంటే నాటకీయత ఎక్కువ కనపడుతుంది. సత్య పాత్ర గుజరాత్‌ వెళ్లి తమకు రావాల్సిన డబ్బుని సాధించిన సీన్‌ , ఢిల్లీలో తీసిన సన్నివేశాలు సినీ ఫక్కిలోనే ఉన్నాయి. ప్రేక్షకులు లీనం కాలేరు. నాగ చైతన్య , సాయి పల్లవి చక్కగా నటించారు. అయితే దర్శకుడు చందు ప్రేమకథ, దేశభక్తి ఈ రెండింటి మేళవిస్తూ కాస్త తడబడినట్లు కనపడింది. ఇక దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఈ టాండేల్ సినిమాకు హైలైట్ గా చెప్పుకోవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *