సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం వెలగపూడి సచివాలయంలో 2వ తడోజు రాష్ట్రంలో 26 జిల్లాల కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న పెంక్షన్స్ లు ఎక్కువ మంది అనర్హులకు చేరుతున్నాయని ప్రస్తుత సర్వే లలో తెలుస్తుంది. ఇది వికలాంగ పింఛనులులో చాల మంది అనర్హులకు వెళుతున్నట్లు అధికారులు ద్రువీకరిస్తున్నారు. అటు వంటి పింఛనులు రద్దు చేసి మెడికల్ సర్టిఫికెట్స్ ఇచ్చిన డాక్టర్స్ ఫై చర్యలు తీసుకోవాలి. వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్‌ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని, అర్హత లేనివారికి ఇవ్వకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు చాలా మంది రూ. 15 వేలు అడుగుతున్నారని కలెక్టర్లు తెలుపగా.. సదరం ధృవీకరణ పత్రాలలో డిజేబుల్డ్ అంటే పనిచేయలేని స్ధితిలో ఉండి అంటేనే ఇవ్వాలని పింఛన్ లు ఇవ్వాలి . ఫిజికల్లీ హ్యండీక్యాప్డ్ కాని వారు ఫెన్షన్ తీసుకుంటున్నారని తెలిపారు. డమ్ అండ్ డఫ్ విషయంలో వారి విషయంలో ఎవ్వరూ గుర్తించలేరన్నారు. అర్హత లేనివారికి ఇవ్వకుండా చూడాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తల్లిదండ్రులు చనిపోయి చిన్నారులు ఉంటే వారికీ పెన్షన్ ఇవ్వాలని సీఎం సూచించారు.పలు జిల్లాలలో కలెక్టర్ల వద్ద ఉపాధి హామీ డబ్బులు ఉన్నా బిల్లులు ఎందుకు చెల్లించటం లేదని ఆగ్రహించారు.
