సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల స్ధాయి “వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2025” నిర్వహించడానికి నోడల్ కాలేజీ గా డి.ఎన్.ఆర్. కళాశాలను కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఎన్నిక చేసినదని కళాశాల ప్రిన్సిపాల్ జి.మోజెస్ తెలిపారు. నోడల్ కాలేజీ గా డి.ఎన్.ఆర్.కళాశాలను ఎంపిక చేసినందుకు కళాశాల పాలకవర్గ అధ్యక్షులు జి.వి. నరసింహరాజు గారు, సెక్రటరీ మరియు కరస్పాండెంట్ జి.సత్యనారాయణ రాజు(బాబు), ఉపాధ్యక్షులు జి. పాండురంగ రాజు, పరిపాలనాధికారి పి.రామకృష్ణం రాజు అభినందనలు తెలిపారు.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా యూత్ పార్లమెంట్ కార్యక్రమములో పాల్గొనవలసిన వారు 18 నుండి 25 సంవత్సరాలు పూర్తి అయిన వారు పాల్గొనవచ్చని ముందుగా ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా mybharat.gov.in పోర్టల్ లో తమ పేర్లను నమెదు చేసుకొని, “what does Viksit Bharat mean to you? అనే అంశం పై ఒక నిమిషం నిడివి కలిగిన వీడియోను వికిసిత్ భారత్ లింక్ లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. పేర్లు నమోదు చేయించుకున్న వారిలో 150 మందిని స్క్రీనింగ్ చెసి వారికి డి.ఎన్.ఆర్ కళాశాలలో పోటీలు నిర్వహించి 10 మందిని రాష్ట్ర స్ధాయికి ఎంపిక చేసి పంపుతారని జిల్లా యువజన అధికారి డి. కిషోర్ తెలిపారు. మర్చి 9వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి. ఇతర వివరాల కొరకు 8179179899, 9441388058 సంప్రదించాలని తెలిపారు
