సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏలూరు జిల్లాలో సంచలన కలిగించిన వికాస్ విద్య సంస్థలులలో విద్యారులు ఫీజులు చెల్లించిన ఇంకా ఏవో మెలికలు పెట్టి టీసీలు ఇవ్వడం లేదని గత 3వారాలుగా కలెక్టర్ కు స్పందనలో విద్యార్థులు తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులపై కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం లోని వికాస్ విద్యా సంస్థపై విచారణ చేసి రికార్డులు సీజ్ చేసి, ఎంఈఓకు బదిలీ చేసినట్లు డీఈఓ పి.శ్యా మ్ సుందర్ చెప్పా రు. ఆయన విచారణ లో తేలిన వివరాలు ప్రకారం.. విజ్ఞాన విద్య సంస్థలు ఫై సుమారు 20 వరకు ఫిర్యాదులు వచ్చా యన్నారు. దీనిపై ఈ నెల 16న మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చామని, అయితే విద్యా సంస్ధల కరస్పాండెంట్ ఊరకర్ణం జగన్నాధరావు సమాధానం ఇవ్వలేదన్నారు. ఫిర్యాదుల నేపథ్యంలో వారు టీసీలు సక్రమంగా ఇవ్వడం లేదని గుర్తిం చామన్నారు. దీంతో అడ్మిషన్ రిజిస్టర్తో పాటు రెండు టీసీ పుస్తకాలను స్వాధీనం చేసుకుని ఎంఈవోకు అప్పగించామన్నారు. ఇక నుంచి ఎం ఈవో ద్వారా టీసీలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వికాస్ విద్యా సంస్థలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ గుర్తింపు లేదన్నా రు. ఈ విచారణలో డీఈవోతో పాటు ఎం ఈవో బి.రాముడు, ఎం ఈవో–2 జి.రాములు, ఆర్ఐ రమేష్, జంగారెడ్డిగూడెం సీఐ పి.రాజేష్ పాల్గొన్నారు.
