సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సైంధవ్’. విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. డిసెంబరు 22న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తాజగా ప్రకటించింది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో వెంకటేశ్ మెషీన్‌గన్‌తో కంటైనర్‌పై కూర్చొని సీరియస్ లుక్‌లో కనిపించారు. వెంకీ సరసన కెజిఎఫ్ భామ శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది, హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ కీలకపాత్ర పోషిస్తున ఈ చిత్రానికి వెంకట్ బోయనపల్లి నిర్మాత. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
