సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్, దేవుడుగా ప్రత్యేక పాత్రలో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్, జంటగా తమిళ హిట్ సినిమా ‘ఓ మై కడవులే’ రీమేక్ ‘ఓరి దేవుడా’ పేరుతో అదే దర్శకుడు అశ్వత్ మారిముత్తు తో నేడు, శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొనివచ్చారు. .ప్రముఖ నిర్మాతలు పి వి పొట్లూరి, దిల్ రాజు ఈ సినిమా కు ఫాంటసీ తో కూడిన కథ ఏంటి అంటే.., అర్జున్ (విశ్వక్ సేన్), మణి (వెంకటేష్ కాకుమాను), అను (మిథిలా పార్కర్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఈ ముగ్గురూ ఒకసారి బార్‌లో కలిసి కూర్చుని తాగుతూ ఉండగా అను సడన్ గా అర్జున్ ని పెళ్లిచేసుకోమని అడుగుతుంది. అర్జున్ సరే అని పెళ్లి చేసుకొంటాడు. అయితే పెళ్లయ్యాక అర్జున్, అనుతో కాపరం చెయ్యలేకపోతాడు. ఎందుకంటే ఆమెని స్నేహితురాలిగానే చూస్తున్నాడు, కానీ భార్యగా చూడలేకపోతున్నాడు. అప్పుడే అర్జున్ కి కాలేజీ లో సీనియర్ అయిన మీరా (ఆశభట్) పరిచయం అవుతుంది. మీరాతో అర్జున్ కొంచెం సన్నిహితంగా ఉండటం అనుకి నచ్చదు. ఇలా కలతలు పెరిగి ఇద్దరూ విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటారు. అప్పుడు అర్జున్ లాయర్ దేవుడు ( విక్టరీ వెంకటేష్ ) దగ్గరకి వెళతాడు. అప్పుడు మొదలవుతుంది అసలు కధ .. లాయర్ దేవుడు, అర్జున్ కి పరిష్కారం ఏమి చెప్పాడు?అర్జున్ విడాకులు ఇప్పించాడా?అన్నది సినిమాలో చూడాల్సిందే. ఈ ‘ఓరి దేవుడా’ సినిమా. సినిమాలో దర్శకుడు భావేద్వేగాలతో బాగా చూపించగలిగాడు. మొదటి సగం సరదాగా సాగినా, రెండో సగం మాత్రం కొంచెం భావేద్వేగాలుతో అందరు బాగా నటించడంతో సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. దర్శకుడు మారిముత్తు చక్కటి ఫలితం సాధించాడని చెప్పాలి. విశ్వక్ సేన్ కి రెండూ రకాలు షేడ్స్ పాత్ర బాగా చేసాడు, మిథిలా పార్కర్ బాగా చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ కాకుమాను నవ్వులు పండించాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ ఒక చిన్న పాత్రలో దర్శకుడిగానే కనిపిస్తాడు. ఇక విక్టరీ వెంకటేష్ దేవుడిగా కనిపిస్తాడు. నిడివి తక్కువ ఉన్న వెంకటేష్ పాత్ర సినిమాకు చాల కీలకం మరి … ఆ పాత్రలో వెంకీ చెయ్యడం వల్లే సినిమా రేంజ్ పెరిగింది. తమిళ్ లో విజయ్ సేతుపతి, కన్నడలో పునీత్ రాజ్ కుమార్ చేసారు, మొత్తానికి సినిమా బాగుంది. ఇంకా తరుణ్ భాస్కర్ రాసిన మాటలు చాల బాగున్నాయి. సో మొత్తానికి ఈ సినిమాతో విశ్వక్ సేన్ ను మరో మెట్టు ఎక్కినట్లే.. ఇక విక్టరీ వెంకటేష్ … దిల్ రాజు కాంబినేషన్ లో వరుసగా 4 వ హిట్ తో 100శాతం ఫలితం సాధించారు అని చెప్పవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *