సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్, రానా లు కలసి “ఘర్షణ ” సినిమా తరహా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారని అందిరికి తెలిసిందే.. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ సిరీస్ పేరు ‘రానా నాయుడు’ హిందీలో తెరకెక్కిన ఈ సిరీస్‌కి కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. అమెరికన్ సిరీస్ ‘రే డోనోవాన్’కి రిమేక్‌గా తెరకెక్కింది. అయితే ఇది రొటీన్ తరహా కుటుంబ డ్రామా కాదు. బాబాయ్, అబ్బాయ్ ఒకరితో ఒకరు గొడపడడం తో ద్రిల్స్ ని ఇందులో వంటి ఫన్ తో పాటు యాక్షన్ ద్రిల్స్ చూస్తారు. అయితే.. తాజగా..ఈ టీజర్ హిందీలో మాత్రమే విడుదలయింది. ఇంకా తెలుగులో లేదు. కానీ.. వారిద్దరి తెలుగు నటులు కావడం, మూవీ జరిగేది కూడా హైదరాబాద్ కేంద్రంగా కావడంతో తెలుగులో డబ్ చేసి విడుదల చేసే అవకాశం ఉంది.మొత్తానికి , దగ్గుబాటి అభిమానులకు సంతోషంగా కలిగించేలా ఉంది. అంతేకాకుండా.. అటు బాబాయ్, ఇటు అబ్బాయ్ పోటీ పడి నటించారు. విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి పూజ హెగ్డే జంటగా ‘కబీ ఈద్ కబీ దివాళి’ అనే సినిమాలో చేస్తున్నాడు.
