సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. నిజానికి సినీ పరిశ్రమలో 90శాతం హిట్స్ ఉన్న ఏకైక హీరో వెంకటేష్ మాత్రమే.. ఇప్పటికి మొన్న వచ్చిన ఎఫ్ 3 గాని ఇటీవలె విశ్వక్సేన్ హీరోగా ‘ఓరి దేవుడా’ సినిమాలో దేవుడు రోల్ పోషించిన కూడా హిట్స్ కొట్టేసాడు. అయితే అతనిలో ఎప్పుడు వుండే ఆధ్యాత్మిక కు మరింత సమయం కేటాయించాలని ఇటీవల విరామం ప్రకటించడానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం. సినిమా కొత్త కథలు వినేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వా లని డిసైడ్ అయ్యారట. విరామం తర్వా త కొత్త సినిమాలను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. కాగా వెంకటేశ్-రానా నటించిన రానానాయుడు వెబ్ సిరీస్, మరియు హిందీలో సల్మాన్ ఖాన్ తో కల్సి చేస్తున్న మల్టీస్టార్ సినిమా త్వ రలోనే ప్రేక్షకుల ముందుగకు రానున్నాయి, .
