సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అపూర్వ దృశ్యకావ్యాల దర్శకుడు మణిరత్నం కలల ప్రాజెక్టు అయినటువంటి తమిళుల పురాతన చోళులు, పాండ్యులు చరిత్ర ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కి.. గత ఏడాది ఒక పార్ట్ విడుదలై తమిళనాట నెంబర్ 1 కలెక్షన్స్ రికార్డ్స్ సాధించిన సినిమాగా సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులో హిందీలో కూడా ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ ‘పొన్నియిన్ సెల్వన్’ రెండో భాగం ‘పిఎస్ 2’ గా నేడు శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌ లో ప్రీమియర్ షోలు కంప్లీట్ అవడంతో పాటు.. తమిళనాడు లో ప్రీమియర్ షోస్ లో భారీ ఓపెనింగ్స్ సాధించిందని రిపోర్ట్. తెలుగునాట తక్కువ థియేటర్లు వెయ్యడంతో ఓపెనింగ్స్ బాగానే వస్తున్నాయి. ఇక మణిరత్నం.. ఈ ‘పిఎస్2’తో ఎటువంటి మ్యాజిక్ క్రియేట్ చేశాడనేది టాక్ లో తెలుసుకొంటే.. సినిమా మొదటి భాగం కన్నా కాస్త ఓపికగా చూడాలి. యుద్ధ సన్నివేశాలు తక్కువ.. క్లైమాక్స్ యుద్ధం బాగుంది. ఇక కధనం అంతా ముఖ్యంగా విక్రమ్ మరియు ఐశ్వర్యరాయ్‌ ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు నేపథ్యంలో నడుస్తుంది. ఆ సన్నివేశాలు మణిరత్నం మార్క్ లో అద్భుతంగా ఉన్నాయి. మంచి దేహారుడ్యంతో ఎదురులేని యూదుడు గా భగ్న ప్రేమికుడిగా చియాన్ విక్రమ్ నటన లో జీవించేసాడు. ఓమై రాణికి సంబంధించిన సన్నివేశాలను విడమరిచి చెప్పిన తీరు బాగుంది. మొదటి భాగంలో దున్నేసిన కార్తీ, ఐశ్వర్య పాత్రలను కాస్త తగ్గించి వారి అరుపులతో సరిపెట్టారు. ఇక టైటిల్ పాత్ర దారి జయం రవి కి కూడా మొదటి భాగంతో పోలిస్తే తక్కువ పాత్రే మిగిలింది. ఇక రఘు పాత్ర నిడివి పెద్దదే. ఇక ఐశ్వర్య రాయి డ్యూయల్ రోల్ లో వృద్ధ మహిళా రోల్ సస్పెన్సు కు తెరదించుతూ ఈ స్వీకెల్ లో మంచి షాకింగ్ పాత్రగా తీర్చిదిద్దారు. అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. AR రెహమాన్ క్లాసిక్ సంగీతంతోదాదాపు 3 గంటల నిడివితో ప్రశాంతంగా అంచనాలు లేకుండా చుస్తే మంచి అనుభూతి ని పంచుతుంది అని టాక్.. తమిళ్ లో మంచి హిట్ పక్క.. అయితే తెలుగులో ‘పిఎస్ 1 చుసిన ప్రేక్షకులు మరో సారి పిఎస్ 2 కు వస్తేనే ఆ అనుభూతిని ఆస్వాదిస్తారు. చియాన్ విక్రమ్ కు చాల కాలానికి సోలో హిట్ పడింది అని చెప్పవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *