సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుస పరాజయాలతో వెనకబడుతున్న అందాల యువ హీరో విజయ్ దేవరకొండ హీరోగా టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో విజయ్ ‘VD 14’ ను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటీకే రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ‘ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్’ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరి ఈ సినిమాలో ప్రధాన విలన్ గా హాలీ వుడ్ నటుడు పోషిస్తున్నాడని సమాచారం. ఒకనాడు హాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ది మమ్మీ’ సిరీస్ సినిమాల లో అతీంద్రియ శక్తులతో శాపగ్రస్తుడైన ప్రధాన పూజారి ఇమ్‌హోటెప్ పాత్రలో మాస్టర్ క్లాస్ యాక్టింగ్తో ఆకట్టుకున్న నటుడు ఆర్నాల్డ్ వోస్లూ.’VD 14’లో ఒక కీలక పాత్రలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో విజయ్ తర్వాత ఆర్నాల్డ్‌దే కీలక పాత్రా కానున్నట్లు తెలుస్తోంది.
