సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యువ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devera konda) ప్రస్తుతం ఆయన గౌతమ్ సూరి దర్శకత్వంలో భారీ సినిమా ‘కింగ్ డం’ సినిమా చేస్తున్నారు. త్వరలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా. ఈ సినిమా తర్వాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం రౌడీ జనార్థన్ (Rowdy Janardhan). ఈ సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ‘రాజా- రాణీ’ దర్శకుడు రవి కిరణ్ కోలా దర్శ కత్వం వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ సీనియర్ హీరో రాజశేఖర్(Hero Rajasekhar) నటించబోతున్నట్లు సమాచారం . ఇటీవలే రాజశేఖర్ విలన్లుక్ పై ఫోటోషూట్ నిర్వ హించగా..గతంలో ఆహుతి తరహాలో మంచి లుక్ వచ్చిందని దీనికి రాజశేఖర్ కి కూడా మంచి పారితోషకం ఆఫర్ చేశారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *