సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు, ఆదివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ అధికారుల, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ రిపబ్లిక్ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. ఈయనతో పాటు సహా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వివిధ శాఖలు ఎంతో సృజనాత్మకంగా ఏర్పాటు చేసిన వాహన శకటాల పెరేడ్ ను సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు ఆసక్తిగా వీక్షించారు.రాష్ట్రంలో విశిష్ట సేవలు అందించిన అధికారులకు కళాకారులకు, ఉపాధ్యాయులకు విశిష్ట పతకాలు గౌరవ పురస్కారాలు అందజేశారు.
