సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రజలు గర్వపడే గొప్ప నగరం.. విజయవాడ నగరం గత 4 రోజులుగా వరద ముంపులో ఉంది. వరద తగ్గిన. తాజా పరిస్థితి ఏమిటంటే.. పలు కాలనీల నుంచి ఇంకా బయటకు వెళ్ళని నీరు.. 8 అడుగుల నుంచి 3 అడుగులకు బుడమేరు వరద ఉదృతి తగ్గింది. నేడు బుధవారం మరల వర్షం పడుతుంది. సీఎం చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగిన సరే.. అరకొర తప్ప.. బాధితులను ఆదుకోవడంలో ప్రజా ప్రతినిదులు, ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యం స్వష్టంగా కనపడుతుంది. బయట ప్రాంతాల నుండి దాతలు పంపిన ఆహారం, నీరు కూడా బాధితులకు సక్రమంగా అందించలేని దుర్భర పరిస్థితి.. ఇపుడిపుడే.. ఆహారం అందక , కరెంట్ లేక పిల్లలతో పస్తులు ఉంటున్నచాల కుటుంబాల వారు బయటకు వచ్చి స్వచ్చంద సంస్థలు అందిస్తున్న ఆహారం కోసం నిరక్షిస్తున్న, పొట్లాల కోసం, పాలు నీళ్ల బాటిల్స్ కోసం పోరాడుతున్న హృద్రాయ విదారక దృశ్యాలు కనపడుతున్నాయి.కొందరు కుటుంబాలకు వేరే ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.. ముంపు ప్రాంతాలలో ఎందరూ మరణించారో , అనారోగ్యాలతో మరణించినవారి పూర్తీ సమాచారము అందటం లేదు. అయితే, వరదల్లో గత 2 రోజుల్లో12 మృతదేహాలను ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు గుర్తించారు. ఇక, పునరావాస కేం ద్రాలకు 75 వేల మంది ప్రజలు వెళ్లారు. మరోవైపు పాలు నీళ్లు తో సహా నిత్యావసర సరుకులు ధరలు దారుణంగా పెంచేసి బాధితులను దోచుకొంటున్న వర్గం..ఇక, వేల సంఖ్య లో గల్లంతైన ద్విచక్ర వాహనాలు, కొట్టుకుపోయి నీట మునిగిన కార్లు.. ప్రభుత్వ సాయం ఇంకా అందని వాళ్ళు ఇంకా వేలల్లో ఉం టారని ప్రభుత్వం అంచనా వేసింది. నగరాన్ని ముం చిన బుడమేరుకు పడిన 3 గండ్లు పూడ్చి వేతకు మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
