సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో నగరంలో అన్ని ప్రాంతాలలో గృహాల లో చేరిన వరద నీరు లాగుతుంది. భారీగా చేరిన బురదను తొలగించే పనిలో కుటుంబాలు ఉండగా.. ప్రభుత్వ ఆదేశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కీలక అధికారులు తో పాటు 5వేల మంది పైగా మునిసిపల్ పారిశుధ్య కార్మికులు, వందలాది ఫైర్ ఇంజెన్స్ లు కూడా చేరుకొని యుద్ధ ప్రాతిపదిక మీద బురద ను తొలగించి ప్రధాన రోడ్డులు ప్రభుత్వ కార్యాలయాలు శరవేగంగా శుభ్రం చేసే పనిలోనూ బ్లీచింగ్ చల్లే నిమగ్నమయ్యారు. నిన్న , నేడు, గురువారం పైపులరోడ్డు, ప్రకా్‌షనగర్, వాంబే కాలనీ వంటి దూర ప్రాంతాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో బయట కు వచ్చారు. ప్రకాష్ నగర్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర నడుములోతు వరదను దాటుకుంటూ వస్తున్నారు. గత 5 రోజులుగా రోజులుగా సరైన ఆహారం, నీరు లేక వారంతా నీరసించిపోయారు. అంబులెన్స్‌లను తగిన సంఖ్యలో సిద్ధం చేయటం వల్ల వారిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించగలుగుతున్నారు. బయటకు వస్తున్న బాధితుల్లో పెద్దలు పిల్లలు ఎక్కువ మంది వైరల్ జ్వరాలతోనే బాధపడుతున్నారు., ఒళ్లు నొప్పులు, బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. గుండె జబ్బులు, కాలేయ, కిడ్నీ సమస్యలు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారిని బయటకు రాగానే పెద్ద ఆస్పత్రులకు తరలిస్తున్నారు.దీంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు వరద బాధితులతో కిటకిటలాడుతోంది. ఈ వైరల్ జ్వరాలను కంట్రోల్ చెయ్యడమే ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజ్..
