సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నూతన సంవత్సరం సందర్భంగా శాసనమండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు నేడు, సోమవారం ఉదయం ముందుగా సీఎం జగన్ కార్యాలయం చేరుకొని ఆయనకు శుభాకాంక్షలు అందజేశారు. తదుపరి విజయవాడలోని గెస్ట్ హౌస్ కు చేరుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన వేద పండితులు చేత శ్రీవారి ఆశీస్సులు అందుకొన్నారు. భీమవరంలోని గునుపూడి లో ఆయన నివాసంలో ఆయన అందుబాటులో లేకపోవడంతో ( విజయవాడలో ఉన్నారు)అనేక మంది వైసిపి నేతలు , పార్టీలకు అతీతంగా ఆయన శ్రేయాభిలాషులు ఆయన కుమారుడు సుందర్ రాజు కు శుభాకాంక్షలు తెలియజేసారు.
