సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో 5గురు సభ్యుల ఓ డాక్టర్ ఓ కుటుంబం ఆత్మహత్యకు ? పాల్పడటం స్థానికులతో తీవ్ర కలకలం రేపుతోంది. చనిపోయిన వారు ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు. మృతుల్లో భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేస్తున్నారు. అయితే చనిపోయిన శ్రీనివాస్ గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. ఏడాది క్రితం శ్రీజ హాస్పిటల్‌ను ప్రారంభించారు. అయితే ఆస్పత్రి నష్టాలలో మునిగిందన్న తీవ్ర ఆందోళనతో శ్రీనివాస్ డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు నెలల క్రితమే ఆస్పత్రిని శ్రీనివాస్ వేరేవారికి అప్పగించారు. కాగా.. ఇంటి బయట చెట్టుకు ఉరి వేసుకుని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోగా.. నలుగురు కుటుంబసభ్యుల గొంతు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్యపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నలుగురిని హత్య చేసి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక అందిరినీ ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసలు దర్యాప్తు చేపట్టారు.
