సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో సరికొత్తగా సీప్లేన్‌ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. విజయవాడ పున్నమిఘాట్‌ నుంచి శ్రీశైలంలోని పాతాళగంగ వరకు ఫస్ట్‌ సర్వీస్‌ నడించింది. సీఎం చంద్రబాబుతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు తొలి సర్వీస్‌లో జర్నీ చేశారు. సీ ప్లేన్‌తో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు..ముఖ్యమంత్రి. రౌడీలు ఉంటే రాష్ట్రానికి ఎవరూ రారని..పెట్టుబడులు కూడా పెట్టరని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *