సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కాజీపేట-వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గం లో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. గోదావరి జిల్లాల రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని ముందే గమనించాలి.. గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఈ నెల 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్- విజయవాడ శాతవాహన ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 7వ తేదీతోపాటు 10 నుంచి 18 వరకు, సికింద్రాబాద్-భద్రాచలం రోడ్డు కాకతీయ ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 6వ తేదీతోపాటు, 10 నుంచి 18 వరకు, ఆదిలాబాద్-తిరుపతి కృష్ణా ఎక్స్ ప్రెస్ ను ఈనెల 5 నుంచి 19వరకు రద్దు చేశారు. ఈ నెల 10 నుంచి 18 వరకు, కాజీపేట-తిరుపతి, లింగంపల్లి నుంచి కాకినాడ వెళ్లే గౌతమి రైళ్లను రద్దు చేశారు. అలాగే గోల్కొం డ ఎక్స్ ప్రెస్ ఈ నెల 11 నుం చి 19 వరకు కాజీపేట వరకు మాత్రమే నడుస్తుంది.
