సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు ఇరాన్,. అమెరికా యుద్ధానికి రెండు వారాల పాటు విరామం లభించడంతో సౌదీ అరేబియాలోని దమ్మమ్‌ నుంచి, విజయవాడ మధ్య రిలీఫ్‌ ఫ్లైట్స్‌ నడపడానికి జజీరా ఎయిల్‌లైన్స్‌ ఈనెల 13 నుంచి 29 వరకు ఆ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ మేరకు విజయవాడ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇవ్వటంతో పాటు స్లాట్‌ను బుక్‌ చేసుకుంది. వచ్చే సోమ, బుధ, శుక్రవారాల్లో ఆ విమానాలు నడుస్తాయి. దమ్మమ్‌కు చేరాక అక్కడి నుంచి కువైట్‌కు కూడా ఈ సర్వీసులు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అలాగే విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ‘ఫ్లై 91’ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసులు నేటి శుక్రవారం నుంచి ప్రారంభించారు. ప్రతి రోజు 7.30 గంటలకు నూతన విమాన సర్వీసు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *