సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మచిలీ పట్నంలో నేటి మంగళవారం రాత్రి జనసేన పార్టీ పదో వార్షిక ఆవిర్భా వ సభలో పాల్గొనేం దుకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన వారాహి వాహనం ఫై విజయవాడ నుంచి మచిలీపట్నం బయలుదేరారు. ఆటోనగర్లో పవన్ గజమాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. వారాహి వాహనం ఫై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ పార్టీ అభిమానులతో జనసేన జెండాలు పట్టుకొని భారీ ర్యాలీగా పవన్ బయలు దేరి నేటి సాయంత్రానికి మచిలీపట్టణం చేరుకొన్నారు. అక్కడ కౌలు రైతుల కుటుంబ సభ్యు లను పవన్ పరామర్శించి 47 కుటుంబాలకు ఒకొకరికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ బహిరంగ సభకు విశేషముగా జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కోసం నీరిక్షిస్తున్న నేపథ్యంలో రాత్రి7న్నర గంటలకు సమయం కు ఆయన వేదిక ఫైకి వచ్చే అవకాశం ఉంది.
