సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ నుండి సింగపూర్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త.. విజయవాడ-సింగపూర్ మార్గంలో నవంబర్ 15 నుంచి ఇండిగో సంస్థ తన కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సర్వీసును ప్రారంభించనుంది. ఇకపై హైదరాబాద్ లేదా చెన్నై మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండాడైరెక్ట్ గా విజయవాడ నుంచే సింగపూర్ ప్రయాణించవచ్చు. ఇక ఫ్లైట్ టికెట్ ధర కేవలం రూ.8 వేలు మాత్రమే కావడం విశేషం. సాధారణంగా సింగపూర్ కు ప్రయాణించాలంటే.. కనీసం రూ.15 వేలు వరకు ఖర్చవుతుంది. ఈ సర్వీసుతో కేవలం రూ.8 వేలకు ప్రయాణం అందుబాటులో ఉంటుంది. ఇక్కడి నుంచి విమానం ఉదయం 10.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.05 గంటలకు సింగపూర్ చాంగి విమానాశ్రయానికి చేరుకుంటుందని వివరించింది. నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని తెలిపింది. మూడు రోజులు(మంగళవారం, గురువారం, శనివారం) ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 180 నుంచి 230 సీట్లు కలిగిన ఇండిగో బోయింగ్ ఫ్లైట్ లతో సర్వీసులు నడువనున్నాయి.
