సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ తో యుద్ధం వరకు వెళ్లిన ఉద్రిక్త పరిస్థితులలో దేశంతో పాటు మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఉద్రిక్తలు రెచ్చగొట్టడానికి ఉగ్రవాద మూకలు కుట్రలు చేస్తుండటం వారికీ బ్రతుకు తెరువుకు భారత్ వచ్చిన కొన్ని ముస్లీమ్ కుటుంబాలు, వారికీ ఇక్కడి ఇంటి దొంగలు సహకరిస్తున్న పరిణామాలు పోలీస్ దర్యాప్తులలో తేటతెల్లం అవుతున్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ముస్లీమ్ యోధులు ఉన్న ఈ భారత్ దేశంలో.. ఇటీవల విజయనగరం లో విదేశీ నిదులతో ఒక ముస్లీమ్ కుటుంబం బాంబుల తయారీ చేస్తూ పట్టుబడటం ఆందోళన రేకెత్తించే విషయాలే.. అందుకే రాష్ట్రాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించాలని.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. విదేశీయులకు ఆశ్రయం కల్పించడానికి భారత్ ఏం ధర్మశాల కాదని సుప్రీం కోర్ట్ సైతం స్ఫష్టం చేసిన నేపథ్యంలో .. తాజాగా విజయవాడలోని పెనమలూరు మండలం కానూరు, తాడిగడపలో నేటి శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్, మయన్మార్‌కు చెందిన 15 మంది యువకులను గుర్తించారు. అనంతరం వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురు యువకులు ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలి వచ్చినట్లు పోలీసులు విచారణలో తెలిసింది.వారి ఫై లోతుగా దర్యాప్తు జరుగుతుంది.
