సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు ను దక్షిణ రైల్వే ప్రకటించింది. నెం.06507 బెంగళూరు – ఖరగ్‌పూర్‌, ప్రత్యేక రైలు ఈనెల 19, 26, మే 3, 10, 17(శుక్రవారం) తేదీల్లో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మూడో రోజు తెలవారుజాము 2.45 గంటలకు ఖరగ్‌పూర్‌ చేరుకుంటుంది. మరోమార్గంలో నెం.06508 ఖరగ్‌పూర్‌ – బెంగళూరు ప్రత్యేక రైలు ఈనెల 15, 22, 29, మే 6, 13, 20 (సోమవారం రోజులలో) తేదీల్లో ఖరగ్‌పూర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 7.50 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ రైలు కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం నార్త్‌, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బరంపురం, ఖుర్దా రోడ్డు, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలాసూర్‌ స్టేషన్లలో ఆగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *