సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ నగర సమీపంలోని ఎనికేపాడు (Enikepadu)లో నేడు, సోమవారం ఉదయం ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వచేసే గోదాంలో భారీ అగ్నిప్రమాదం ( Fire incident) జరిగింది. భారీ మంటలతో పాటు చుట్టూ పక్కల ప్రాంతాలను పొగ కమ్మేయడంతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే నిర్వాహకులు అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందటంతో ఫైర్ సిబ్బంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని నిర్వాహకులు అంటున్నారు. దర్యాప్తు లో తెలుస్తుంది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.5 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగి ఉంటుందని కంపెనీ నిర్వాహకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *