సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ ఇంద్ర కీలాద్రి ఫై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని ఈ దసరా నవరాత్రులలో దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. నేడు శుక్రవారం మూలా నక్షత్రం నేపథ్యంలో శ్రీ అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారు జాము 2 గంటలనుండి నేటి రాత్రి 11 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు, సీఎం జగన్ ఆలయ మర్యాదలు పాటిస్తూ పట్టువస్త్రాలు ధరించి నుదుట నిలువు బొట్టు ధరించి వేదపండితులు మంత్రోచ్చారణల మధ్య తలపై శ్రీ కనక దుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను తీసుకొనివెళ్ళి సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ,మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *