సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు, మంగళవారం మచిలీపట్నం వరకు పొడిగించిన ధర్మవరం-విజయవాడ ఎక్స్ ప్రెస్ రైలును విజయవాడలో రైల్వే స్టేషన్లో జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ నుండి రైళ్లలో వచ్చే ప్రజల సౌకర్యం కోసం హైదరాబాద్ నగరశివారులోని చర్లపల్లి వద్ద న్యూ రైల్వే టెర్మినల్ కడతామని ప్రకటించారు. అలాగే ఏపీలో రైల్వే ప్రాజెక్టుల కోసం గత బడ్జెట్లో కంటే ఈసారి 20శాతం అధికంగా నిధులు కేటాయించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 58 కి.మీ మాత్రమే కొత్త లైన్లు వేస్తే.. మోదీ ప్రభుత్వ హయాంలో 350 కి.మీ కొత్త లైన్లు వేశామని చెప్పారు..విజయవాడ-హుబ్బళీ ఎక్స్ ప్రెస్ ను( భీమవరం మీదుగా ) నర్సాపురం వరకు, విజయవాడ-షిర్డీ ఎక్స్ ప్రెస్ ను మచిలీపట్నం వరకు, విశాఖ-కాచిగూడ రైలును మహబూబ్నగర్ వరకు, విశాఖ-విజయవాడ ఎక్స్ ప్రెస్ గుంటూరు వరకు పొడిగిస్తామన్నారు. సికిం ద్రాబాద్-తిరుపతి మధ్య త్వరలో వందేభారత్ రైలు ఏర్పాటు చేస్తామన్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *