సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పై ఆంధ్రప్రదేశ్ సీఐడీ (CID) విభాగం లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఆయనతోపాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి , అరబిందో యజమాని శరత్ చంద్ర రెడ్డి పై ఎల్వోసీ (LOC) ఇచ్చింది. ఈ ముగ్గురూ విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యూలర్ జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని రూ. 3,600 కోట్ల విలువైన వారి వాటాలను రాసివ్వాలని కర్నాటి వెంకటేశ్వరరావు, కేవీ రావు ను గత వైసీపీ ప్రభుత్వ హాయంలో బెదిరించి బలవంతంగా వాటాను లాగేసుకున్నారంటూ ఆరోపణ .. కివి రావు అయితే . గతంలో తనను జైలు కు పంపుతామని భయపెట్టి అత్యధిక షేర్లను అరబిందో సంస్థ సొంతం చేసుకొన్నారని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేసుకొని కేసు రిజిష్టర్ చేసిన వెంటనే వారికీ లుకౌట్ నోటీసులుజారీ చేశారు. ఈ ముగ్గురు విదేశాలకు పారిపోకుండా దేశంలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఎల్వోసీలు పంపినట్లు సీఐడీ అధికారులు పేర్కొన్నారు.
