సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బిచ్చగాడు’ (తమిళంలో పిచ్చైక్కారన్‌) సినిమాతో తెలుగులోనూ సంచలన విజయంతో మంచి క్రేజ్ సాధించిన తమిళ హీరో, సంగీత దర్శకుడు, సినీ నిర్మాత, విజయ్ ఆంటోని. ఓ వైపు హీరోగా నటిస్తూనే, మరో వైపు సంగీత దర్శకుడిగా సైతం దూసుకుపోతున్నారు. అయితే.. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్ ఖాతాలో అంతటి స్థాయి విజయం లేదు. అయినా కొత్త కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకులని పలకరిస్తూనే ఉన్నాడు.యాక్షన్ కింగ్ అర్జున్ తో కలసి చేసిన కిల్లర్ మంచి హిట్ అయ్యింది. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘తమిళరసన్’ బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 15న థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో సురేష్‌ గోపీ, రమ్యా నంబీశన్‌, సోనుసూద్‌ , సత్యరాజ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా సంగీతం సమకూర్చడం మరో విశేషం. విజయ్‌ ఆంటోనీ ప్రస్తుతం శరవేగంగా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో కీలకమైన బిచ్చగాడు 2 సినిమా ( ‘పిచ్చైక్కారన్‌-2’) కూడా కొత్త ఏడాది ప్రారంభంలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధం చేస్తున్నారు. దీనికి మంచి మ్యూజిక్ కూడా స్వయంగా ఇస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో కోట్ల రూపాయలలో మంచి ఫాన్సీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా ‘అగ్ని చిరుగుకల్‌’, ‘ఖాకీ’, ‘మళైపిడిక్కాద మణిదన్‌’ వంటి మరికొన్ని చిత్రాలు లైనులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *