సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)పై హైదరాబాద్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల తమిళ హీరో సూర్య నటించిన రెట్రో (Retro) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పూర్వ కాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, కాశ్మిర్ లో పెహల్ గావ్ లో యాత్రికులపై కొందరు ముర్కుల మూర్ఖత్వంతో దాడి జరిగిందని విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో ఆయనపై ఈ కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదివాసులు, గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేయడంతో తాజగా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పుడీ వార్త తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. అయితే తాను ఎవరిని కించపరచలేదని ఒక మంచి ఉద్దేశ్యంతో మాట్లాడిన మాటలను తప్పుగా ఆపాదించారని విజయ్ దేవర కొండా అన్నారు.
