సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తమిళ సినిమా ‘ జన నయగాన్ సినిమా రిలీజ్ కు ముందే ఇంటర్ నెట్ లో లీక్ అయ్యి సంచలనం సృష్టిస్తుంది. తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఓ మోస్తరు విజయం సాధించిన’ సర్ధార్ భగవంత్ కేసరి’ సినిమా రీమేక్ గా కధలో తమిళ రాజకీయాలు జొపించి అగ్ర హీరో విజయ్ కథానాయకునిగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జన నాయగన్’ మూవీ జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ కాలసింది… ఈ మూవీ తెలుగులో ‘జననాయకుడు’గా రావాల్సింది… అయితే విజయ్ రాజకీయ పార్టీ పెట్టడం.. అక్కడ సెన్సార్ సమస్యల వల్ల, నిర్మాత కోర్టు మెట్లెక్కడం, తరువాత సెన్సార్ వారు కేసు వేయడం ఇలా ‘జన నాయగన్’ రిలీజ్ కు అవాంతరాలు కలిగాయి… ప్రస్తుతం తమిళనాట మరి కొద్దీ రోజులలో ఎన్నికలు జరుగుతున్నాయి. హీరో విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగమ్’ పార్టీపై అన్ని స్థానాలకూ పోటీ చేస్తున్నారు అయితే ‘జన నాయగన్’కు ఎన్నికల్ కోడ్ అడ్డు నిలచి సినిమా విడుదలకు ఆటంకంగా మారింది… అయితే ఇప్పుడు ‘జన నాయగన్’ క్వాలిటీ ప్రింట్ తో ఇంటర్నెట్ లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది… కావాలనే ‘జన నాయగన్’ను సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యేలా చేశారా? అంటే అవుననే అంటున్నారు. ఈ సినిమాను చూసిన వారు హీరో విజయ్ పై మరింత అభిమానం పెరిగి ఆయన ‘టీవీకే’ పార్టీకి ఓట్లు వేస్తారని అయన ఫాన్స్ భావిస్తున్నారు. కాదు, ప్రత్యర్థులే ఓ పథకం ప్రకారం ‘జన నాయగన్’ ను లీక్ చేశారనీ మరో ప్రచారం జరుగుతుంది. చూడాలి ఎవరి వ్యూహమో?
