సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ విద్యాదీవెనపై ( ఫీజు రీఎంబర్స్ మెంట్ )విద్యార్థులకు ఇబ్బందులు పెట్టే ఉమ్మడి బ్యాంకు ఖాతా విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. గత వారం లో ఈ సమస్యపై మన ‘సిగ్మా న్యూస్’ లో ఎన్నికల సమయంలో .. నిధుల కొరతతో..జగన్ సర్కార్ విద్యార్థుల జీవితాలలో వేస్తున్న తప్పటడుగు ను వివరిస్తూ ఐటెం వెయ్యడం జరిగింది. తాజాగా మార్చిలో ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహిస్తారు అని వార్తలు వస్తున్నా వేళా.. జగన్ సర్కార్ వచ్చే ఫిబ్రవరి నాటికి విద్యార్థులంతా ఉమ్మడి ఖాతా తెరవాలంటూ మరో అవకాశం ఇచ్చింది.. అది కూడా వాయిదా పడే అవకాశం ఉంది. అయినా ప్రస్తుతం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న విద్యార్థులకు వారి తల్లితండ్రులకు కాస్త ప్రాణం లేచివచ్చింది. అయితే ఉమ్మడి ఖాతా విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని పూర్తిగా మార్చు కోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన..ఎందరో అర్హులు చక్కగా చదువుకొనే విద్యార్థులు నిబంధనల ఆంక్షలతో.. చిన్న చిన్న కారణాలతో.. విద్యాదీవెన కోల్పోయారు. ఇంకా మరోవైపు విద్యా దీవెన సొమ్ములను ప్రభుత్వం బాగా ఆలస్యంగా విడుదల చేస్తుండటం..కాలేజీల ఖాతాలలో నేరుగా కాకుండా తల్లుల ఖాతాల్లో వేస్తుండటంతో.. కాలేజీల నిర్వహణ ఖర్చులు ఇబ్బందిగా ఉంటుందని కాలేజీ యాజమాన్యాలు వాపోతున్నాయి.
