సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు తమ బ్రాండ్ , క్యాంపస్ ఇంటర్యూలు అంటూ భారీ ప్రచారంతో తగిన వసతులు లేన్నప్పటికీ విద్యార్థుల తల్లి తండ్రులను ఎంతగా లక్షలు దోచేస్తున్నాయో అందరికి తెలిసిందే. ఎవరైనా పట్టిస్తేనే దొంగలు.. లేకపోతె దొరలు.. వాస్తవాలు,కారణాలు కుట్రలు ఏవైనా.. ఈ తరహా వివాదాలలో మోహన్ బాబు యూనివర్సిటీ భారీ ట్రెండింగ్ లో ఉంది. తాజా విషయానికి వస్తే ఇటీవల ఇద్దరు విద్యార్థి నేతలను కిడ్నప్ చేశారనే అబియోగంతో రాష్ట్ర వ్యాప్తంగా SFI ఉద్యమాలు జరగటంతో మంచు మోహన్ బాబు ( Mohan Babu) విశ్వవిద్యాలయానికి సంబంధించి.. నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు (Manchu Vishnu) ఏపీలోని చంద్రగిరి పోలీసులు నేడు, ఆదివారం నోటీసులు పంపించారు. కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరోవైపు విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ తిరుచానూరు పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో మంచు విష్ణును ఏ2గా, మంచు మోహన్ బాబును ఏ3గా చేర్చారు. కిడ్నాప్ కేసులో పీఆర్వో సతీశ్(A1)తో పాటు బౌన్సర్లు కలపి మొత్తం 13 మంది ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటికే ఏపీ హైకోర్టులో మంచు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *