సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం టౌన్ హాలులో నేడు, గురువారం జరిగిన పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొన్నారు. నే ది భీమవరం ఎల్ ఎచ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో ఇటీవలే పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన భీమవరం మండలం, పట్టణంలోని 21 మున్సిపల్, ప్రభుత్వ జెడ్పి పాఠశాలలోని 120 మంది విద్యార్థులకు సుమారు రూ 3 లక్షలను ప్రతిభ పురస్కారాలను లను, మరియు వీరవాసరం గ్రామానికి చెందిన రవాడ కుసుమ లాంగ్ జంప్ క్రీడా విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆమెను ప్రోత్సహిస్తూ ది భీమవరం ఎల్ హెచ్ టౌన్ హల్ తరుపున రూ లక్ష ఆర్ధిక సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతులమీదుగా అందించారు. ప్రతిభవంతులను ప్రోత్సహిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని, విద్యార్థులను ప్రోత్సహించి ఈ విధంగా పురస్కారాలను అందించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. తదుపరి అయన యోగ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ గౌరవాధ్యక్షులు మెంటే పార్ధసారధి, అధ్యక్ష, కార్యదర్శులు కోళ్ల రామచంద్రరావు, గ్రంధి సురేష్, బేతు కృష్ణారావు,, కోశాధికారి జిఎన్ ఫిరోజ్ బాబు, గన్నాబత్తుల శ్రీనివాస్, చినమిల్లి రాయుడు, భూపతిరాజు పేర్రాజు, కోరా రామ్మూర్తి, జనసేన పార్టీ నెట్లను చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, మరియు వబిలిశెట్టి రామకృష్ణ, అడపా బాబ్జి, గ్రంధి నానాజీ, బర్రె నెహ్రూ, కారుమూరి సత్యనారాయణ మూర్తి, విజ్జురోతి రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.
