సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మీడియాలో వస్తున్నా రూమర్స్ నమ్మవద్దని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని, గతంలో ప్రకటించిన విధంగా యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికాలో రోజు లక్షల కేసులు వస్తే కూడా స్కూల్స్ మూయలేదని, విద్య కు ప్రాధాన్యం అటువంటిది, అయితే ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు, వారి భవిష్యత్తు గురించి కూడా అలోచించి సమయానికి తగిన నిర్ణయాలు తీసుకొంటుంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు.
