సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి శుక్రవారం ఉదయం సుమారు 200 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించి, సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉప సభాపతి, ఉండి ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్, భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు , చిలకలూరి పేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణతో కలిసి అసెంబ్లీ సభ విరామం సమయంలో విద్యార్థులు వారితో కాసేపు ముచ్చటించారు. చట్ట సభలపై వాటి నిర్వహణ సభ్యుల హక్కుల ఫై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ ;రఘురామా’ వారితో సరదాగా ముచ్చటించారు.
