సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్ఛోక కరెంట్ బిల్లు తగ్గుతుందని ఆశించిన మధ్యతరగతి కుటుంబాలకు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. మరిన్ని అదనపు చార్జీలతో బాదేస్తున్నారు. దీనితో ఈ వేసవిలో మరింతగా వందలు,వేలాది రూపాయలు అదనంగా పెరిగిన బిల్లులు ఎలా చెల్లించాలి దేవుడా? అని వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు అసలుకు మోసం వచ్చేలా ఇప్పటి వరకు వ్యాపార సంస్థలకు పరిశ్రమలకు మాత్రమే పరిమితం అయినా స్మార్ట్ మీటర్లు ఇప్పుడు సామాన్య నివాస గృహాలకు సైతం స్మార్ట్‌ మీటర్లు బిగించ డానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎన్నికలకు ముందు అసలు రాష్ట్రంలో స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ను వ్యతిరేకించి నేడు అధికారంలోకి రాగానే కూటమి స్మార్ట్ మీటర్లు కు అనుమతి ఇచ్చేయడం ఆ ఖర్చు ప్రజలే భరించాలని ప్రకటించడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌కు రూ.8927, త్రీఫేజ్‌ మీటర్‌కు రూ.17286 ధర నిర్ణయించినట్లు సమాచారం . ఈ మీటర్ ద్వారా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎక్కువ వినియోగ సమయం. ఈ సమయంలో విద్యుత్‌ వినియోగంపై ఎక్కువ చార్జీలు వసూలు చేస్తారు. పైగా సెల్‌ఫోన్‌ రీచార్జి మాదిరి ముందే విద్యుత్‌ బిల్లు చెల్లించాలి. లేకపోతే వెంటనే విద్యుత్‌ సరఫరా ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. ఈ విధానం వలన పరిశ్రమలు, వ్యాపారులకు పెట్టుబడి భారమవు తుంది. తమిళనాడులో నిషేధించినట్లు స్మార్ట్ మీటర్లుపై ప్రభుత్వం పునరాలోచించాలని లెఫ్ట్ పార్టీలతో, ప్రజలతో పాటు కూటమి నేతలు కూడా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *