సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సిపిఐ జిల్లా సమితి సమావేశం భీమవరం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో నెక్కంటి క్రాంతి కుమార్ అద్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ .. పాలకులు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా,ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమించాలని, పార్టీని బలోపేతం చేసుకుంటూ, అరుణ పోరాటాలకు సిద్దం కావాలని, పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలు చాల దారుణంగా పెంచేశారని ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, పీక్ టైం ఛార్జీలు, పెనాల్టీల రూపంలో రాష్ట్రంలో ప్రజలను విద్యుత్ ఛార్జీలతో దోచేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలపై నేటి సోమవారం నుంచి 15వ తేదీ వరకు వివిధ దశల్లో వామపక్షాలు ఆందోళనకు పిలుపునిచ్చాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పెట్రోలు రు.60, డీజిల్ రు.50, వంట గ్యాస్ రు.500 ఉండాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని అన్నారు.సీఎం జగన్ ను మోడీ కాపాడుకుంటూ వస్తున్నాడని విజయదశమి నాటికి రాజధాన్ని విశాఖ తరలిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటనలిస్తున్నా మోడీ మాట్లాడకపోవడం దురదృష్టమని ముప్పాళ్ల విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, బొద్దాని నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.
