సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని, అందుకే సీఎం జగన్, విద్య కోసం వేలాది కోట్ల నిధులను ఖర్చు చేయడం జరిగిందని రాష్ట్రప్రభుత్వ‌ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. నేడు, సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. భీమవరం మండలంలోని పెదగరువు, తుందుర్రు, జొన్నలగరువు గ్రామాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. నవరత్న పథకాలలో ఒకటైన జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, అమ్మ ఒడి, జగనన్న విదేశీ విద్య లాంటి అనేక పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసి విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం పనిచేశారని అన్నారు. నాడు నేడు పథకంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పోరేట్ స్థాయికి మించి అన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. పిల్లలు చదువులు భారం తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే భావనతో ఇన్ని సంక్షేమ పథకాలను వేలాది కోట్లు ఖర్చుపెట్టి అమలు చేసిన ఘనుడు దేశ చరిత్రలో ఏకైక సీఎం జగన్ మాత్రమేనన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *