సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలంగాణ వారి దిష్టి కోనసీమ ,, వ్యాఖ్యలుతో తెలంగాణ నేతలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఫై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అయినప్పటికీ ఏపీలోని కూటమి నేతలు ఎవరు ఆయనకు మద్దతుగా ఒక్క మాట చెప్పకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తాజగా నేడు, శనివారం విడుదల చేసిన ఎక్స్ ట్విట్ లో .. ఏపీలో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని , విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో, అధునాతన సదుపాయాలు కల్పించి, పోషక ఆహారాన్ని, నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఈ లక్ష్యం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలో మంత్రి నారాలోకేష్ చేస్తున్న కృషికి అభినందనీయమని ప్రశంసించారు. తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేసేలా నిర్వహిస్తున్న మెగా పేరెంట్, టీచర్చ్ మీటింగ్స్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు.
